మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేరులో శుక్రవారం మెగా పేరెంట్ మీటింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి ఆదేశానుసారంను మెగా పేరెంట్ మీటింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేర్ ప్రిన్సిపాల్ భద్రాసేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రుల తోపాటు అధ్యాపకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ భద్రాసేన్ మాట్లాడుతూ మీయొక్క పిల్లలను రెగ్యులర్గా కళాశాలకు, గైరాజర్ కాకుండా విద్యార్థులను పంపాలని, పిల్లల రోజువారి చెడు మంచి అలవాట్లను గమనించాలని, పిల్లల చదువు యొక్క పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, లెక్చరర్స్ తో టచ్ లో ఉండాలని తల్లిదండ్రులకు సూచించడం జరిగింది. మీ సహకారంతో ఇంకా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమని తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ క్రింది అంశాలను చర్చించి ఆచరణలో ఉంచాలని నిర్ణయించడం జరిగింది. విద్యార్థుల అభివృద్ధి గురించి చర్చ చదువులో, ప్రవర్తనలో మార్పులపై తల్లిదండ్రులతో చర్చ విద్యార్థుల అలసత్వం సమస్యలు, క్రియాశీలక నిర్ణయాల కార్యక్రమాలపై చర్చ తల్లిదండ్రుల భాగస్వామ్యం, తల్లిదండ్రులు బోధకుల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రుల వారి సలహాలు, అభిప్రాయాల ఆధారంగా పాఠశాల పనితీరు మెరుగవుతుంది. పిల్లలలో మంచి ప్రవర్తనతో పాటు చదువుల పోటీ భావం పెరుగుతుంది. పిల్లలు చదువులు పట్ల అశ్రద్ధగా ఉండే కారణాలు మీకు మాకు తెలిసి వస్తాయి పిల్లలు ఎక్కడ వారి సమయాన్ని వృధాగా కోల్పోతున్నారు. విద్యార్థుల భావి జీవితంలో గురించి, ప్రతిష్టంగా మీరు మేము అవగాహనతో నిర్మాణం చేపట్టే చర్యల గురించి అవగాహన నిర్ణయాలు తీసుకోవడం. కళాశాలకు విద్యార్థులు రాకుంటే జరగబోయే నష్టాల గురించి అవగాహన గురించి చర్చించడం జరిగింది.
తల్లిదండ్రులు మెగా పేరెంట్ మీటింగ్లో పాల్గొనడం వలన ఈ క్రింది అంశాలు మెరుగవుతాయని కళాశాల అధ్యాపకులు తెలిపారు. విద్యార్థి భవిష్యత్తు ప్రకాశవంతం అవుతుంది. బోధకులకి తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. అభ్యాస బోధన శైలులు మెరుగుపడతాయి.విద్యార్థుల బలహీనతలు సరిదిద్దబడతాయి. కళాశాలలో ఇంటిలో సమాజంలో విద్యార్థి క్రియాశీల క్రమశిక్షణ మెరుగవుతుంది. కళాశాలకు గైర్హాజర్ అయ్యే విద్యార్థులు ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ను కోల్పోవడం జరుగుతుంది. అని ఓబుల్ రెడ్డి , కృష్ణయ్య అధ్యాపకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా గెస్ట్ గా పెబ్బేరు మండల తాసిల్దార్ మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని మాట్లాడుతూ మీ పిల్లలను క్రమం తప్పకుండా కళాశాల పంపాలని అప్పుడే వారి భావి జీతం బాగుంటుందని తెలిపారు.
ఈ మెగా పేరెంట్ మీటింగ్లో విద్యార్థుల తల్లిదండ్రులు , విద్యార్థిని విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, బోధినేతల సిబ్బంది పాల్గొన్నారు (Story:మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల)

