ఖమ్మం నూరేళ్ల ముగింపు ఉత్సవాలు విజయవంతం, భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి
న్యూస్ తెలుగు/వనపర్తి : ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ వందేళ్ళ ఉత్సవాలు విజయవంతం అయ్యాయని భవిష్యత్తు ఉద్యమాలకు స్ఫూర్తినిస్తాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ,వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ లు విలేకరుల తో మాట్లాడుతూ ఈనెల 18న ఖమ్మంలో జరిగిన వందేళ్ళ పండుగకు వనపర్తి నియోజకవర్గం నుంచి గణనీయ సంఖ్యలో తరలి వెళ్లారన్నారు. ఖమ్మం జిల్లాలో లక్షలాది మందితో మహా ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ విజయవంతమైందన్నారు. సభకు లక్షలాది మంది నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎర్ర చొక్కాలతో హాజరై సిపిఐ, ఎర్రజెండాపై ప్రజలుకు ఉన్న తమ విశ్వాసాన్ని చాటారన్నారు. సీఎం ప్రసంగం కమ్యూనిస్టుల ప్రాధాన్యాన్ని తెలిపిందన్నారు. ఈ సభలో గిరిజనులు,ఆదివాసులు, గోండులు, బైండ్లవారు వారి వారి సాంప్రదాయ నృత్యాలు,డప్పు దరువులతో చిన్నారులలు, ప్రజానాట్యమండలి కళాకారులు ఆటపాటలతో ఖమ్మం విధులు దగ్గరే విధంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఇదే రీతిలో గ్రామాలలో ప్రజా సమస్యలను గుర్తించి పోరాటం చేయాలన్నారు. పోరాటాలే సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గమని ప్రజలు గుర్తించాలన్నారు. పలు గ్రామాలకు పార్టీని విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయమ్మ, ఆంజనేయులు పాల్గొన్నారు.(Story :” ఖమ్మం నూరేళ్ల ముగింపు ఉత్సవాలు విజయవంతం, భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి )
