Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సైబర్ నేరాల పై అవగాహన కల్పించిన ఎస్ఐ రమేష్

సైబర్ నేరాల పై అవగాహన కల్పించిన ఎస్ఐ రమేష్

0

సైబర్ నేరాల పై అవగాహన కల్పించిన ఎస్ఐ రమేష్

న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు మండలం లోని నరసింహపురం గిరిజన ఆశ్రమ హైస్కూల్లో గురువారం ఎస్సై రమేష్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతేగాక విద్యార్థులతో మాట్లాడుతూ రోడ్డు భద్రత ఉత్సవాలు సందర్భంగా భద్రతా నియమాల గురించి వివరించారు. అలాగే మహిళలపై జరుగుతున్న నేరాలు గురించి సోదాహరణంగా వివరించారు. బాల్యం నుండే విద్యార్థులు ముఖ్యంగా మత్తు పదార్థాలు జోలికి వెళ్ళవద్దని, మద్యం, పొగ తాగటం, గంజాయి సేవించడం, అమ్మడం, అమ్మేవారికి సహకరించడం లాంటి పనులకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఉద్బోధ చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహాపురం గిరిజన ఆశ్రమ హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : సైబర్ నేరాల పై అవగాహన కల్పించిన ఎస్ఐ రమేష్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version