జై జవాన్ జై కిసాన్ నినాదకర్త లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : స్వాతంత్ర సమరయోధుడు తెల్ల విప్లవాన్ని ప్రారంభించి హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిన నిరాడంబరడైన నాయకుడు లాల్ బహుదూర్ శాస్త్రి అని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
ఆయన వర్ధంతి సందర్భంగా వనపర్తి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లాల్ బహుదూర్ శాస్త్రి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాటం బరుడైన లాల్ బహుదూర్ శాస్త్రి స్వాతంత్ర్య ఉద్యమంలో చేరి, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని ఎన్నో మార్లు జైలు శిక్షను అనుభవించారని గుర్తు చేశారు
ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఇటు రైతుల్లో అడ్డు సైన్యంలోనూ పూర్తి మించిన వ్యక్తి మనకందరికీ ఆదర్శ అవ్వాలని ఆయన సూచించారు
కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా దిశా కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, తిరుపతయ్య గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : జై జవాన్ జై కిసాన్ నినాదకర్త లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి )

