మార్చురీ గది ని లాంఛనంగా ప్రారంభించిన రంపచోడవరం ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు /చింతూరు : జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చింతూరు ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మార్చురీ గదిని శుక్రవారం రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి చేతుల మీదుగా ప్రారంభించారు. రెండు లక్షల 80 వేల రూపాయల వ్యయంతో జమాల్ ఖాన్ తన సొంత నిధులతో హాస్పిటల్ నందు మార్చురీ గది ఏర్పాటు చేసినందుకు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అంతరం అనంతరం నిమ్మలగూడెం జమాల్ ఖాన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దర్బారులో ఎమ్మెల్యే చేతుల మీదుగా 24 వేల రూపాయల విలువైన కుట్టు మిషన్లను మహిళలకు అందజేశారు. క్రికెట్ క్రీడాకారులకు 14 వాలీబాల్ కిట్లను అందజేశారు అగ్ని ప్రమాదానికి గురైన నాలుగు కుటుంబాల వారికి లక్ష రూపాయల విలువైన ఇనుప పైపులు సిమెంట్ రేకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అదేవిధంగా చింతూరు ఏజెన్సీ మండలంలో మండల అధ్యక్షులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ తన సొంత ఖర్చులతో అగ్ని బాధితులకు క్రీడాకారులకు,వరద బాధితులకు,కుటుంబ యజమానుల మృతి చెందిన కుటుంబాలకు తన వంతు సహాయంగా ఆర్థికంగా ఆదుకుంటూ ఉన్నారని పార్టీ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సును కోరుతూ సంక్షేమ పథకాలను అందజేయడంలో జమాల్ ఖాన్ ముందున్నారని కొనియాడారు. తాను కూడా అంబులెన్స్ వాహనాన్ని ఏరియా ఆసుపత్రికి కేటాయించి తన వంతు సహాయంగా ప్రజలకు ఉపయోగపడుతున్నానని జమాల్ ఖాన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు చేయూతని ఇవ్వాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. పోలవరం పరిహారం చెల్లిస్తూ ఏజెన్సీ ముంపు మండలాల ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని ఆమె మరోసారి గుర్తు చేశారు. ప్రజలు వివిధ సమస్యలపై తీసుకువచ్చిన దరఖాస్తులను ఆమె స్వయంగా పరిశీలించి జమాల్ ఖాన్ అభ్యర్థన మేరకు వాటిని అధికారులతో చర్చించి పార్టీ శ్రేణుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : మార్చురీ గది ని లాంఛనంగా ప్రారంభించిన రంపచోడవరం ఎమ్మెల్యే )

