Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలి

జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలి

జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలి

న్యూస్ తెలుగు /సాలూరు  : గ్రామ,మండల కమిటీలు త్వరగా పూర్తిచేసి పార్టీ సంస్థ గత కమిటీలు నిర్మాణాన్ని పూర్తిచేసి వైయస్సార్ పార్టీని బలోపేతం చేసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని అరుకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజా రాణి తెలియజేశారు. శుక్రవారం సాలూరు నియోజకవర్గం గ్రామ కమిటీ సంస్థ గత కమిటీల నిర్మాణ ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ కార్యక్రమం మాజీ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైయస్సార్ ప్రభుత్వంలో పేద ప్రజలకు వైద్యం కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలు చేపట్టారని తెలియజేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం చాలా దారుణమని అన్నారు. పార్టీ సంస్థ గతంగా గ్రామ, వార్డు, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకొని పార్టీని ప్రతిష్ట పరుచుకున్నట్లయితే రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయలని అన్నారు. సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ రాజన్న దొర మాట్లాడుతూ నిర్ణీత సమయంలో కమిటీలు వేసి ఫిబ్రవరి 10 తేదీలోపు సాలూరు పార్టీ కార్యాలయం కి ఫోటోల తో సహా కమిటీలు ఇచ్చి డిజిటలైజేషన్ చేయాలని అన్నారు. కమిటీలు వారిగా జాబితాను సిద్ధం చేసి త్వరలోనే గ్రామ,మండల కమిటీలు సమావేశం నిర్వహించి త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. గ్రామ కమిటీ వార్డు కమిటీల పరిశీలికుల నియామకం చేపట్టాలని అన్నారు. 8 అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. క్లస్టర్లుగా విభజించి కమిటీలు నిర్మాణం చేయలని తెలియజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలందరూ పనిచేసే వైయస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కుటమీ ప్రభుత్వ అబద్ధపు హామీలను ప్రజలకు తెలియజేసి, అప్పటి మన ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుకు పార్లమెంటు పరిశీలకులు సెనగం చిన అప్పలనాయుడు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల కమిటీల టార్స్ ఫోర్స్అధ్యక్షులు పసుపులేటి బాలరాజు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సాలూరు నియోజకవర్గ పరిశీలకులు మరిశర్ల బాపూజీ, సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, సాలూరు వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు, పాచిపెంట మండల అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు, వైయస్సార్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!