భాస్కర విద్యానికేతన్ లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరులోని భాస్కర విద్యానికేతన్ హై స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను చైర్మన్ వీ.రంగయ్య డైరెక్టర్ వేణుగోపాలరావు ఘనంగా ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు రాంబాబు విద్యార్థుల తల్లు లకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ ఆటల పోటీలు పాటల పోటీలు నిర్వహించారు. చిన్న బాల విద్యార్థుల తలలపై భోగి పళ్ళు పోశారు. భోగి మంటలు కూడా వేశారు. సంక్రాంతి బసవన్న సాంప్రదాయ రీతిలో ఆట నిర్వహించి, బసవన్నకు పళ్ళు ఆహారంగా అందించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎ సి ఓ త్రివీణ తో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.(Story : భాస్కర విద్యానికేతన్ లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు )

