ద్విచక్ర వాహనంపై వెళుతూ ట్రాక్టర్ ను ఢీకొన్నకూలి మృతి
న్యూస్ తెలుగు/వినుకొండ : ద్విచక్ర వాహనంపై వెళుతూ ట్రాక్టర్ ను ఢీకొన్న ప్రమాదంలో తాపీ కూలి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి కారంపూడి రోడ్ లోని చెక్క వాగు వద్ద జరిగింది. బొల్లాపల్లి మండలం వడ్డే గుంట గ్రామానికి చెందిన వేముల అశోక్ (25) మరియు స్నేహితుడైన రావూరు ప్రసన్న వినుకొండలో తాపీ పనికి వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో చెక్క వాగు వద్ద ట్రాక్టర్ను ఢీకొట్టారు. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న అశోక్ మృతి చెందగా, ప్రసన్న తీవ్ర గాయాలు పాలై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మృతుడు అశోక్ కు. భార్య , ఇద్దరు సంతానం ఉన్నారు. వినకొండ పోలీసులు ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు.(Story : ద్విచక్ర వాహనంపై వెళుతూ ట్రాక్టర్ ను ఢీకొన్నకూలి మృతి )

