నిర్వాసితుల త్యాగ ఫలితమే పోలవరం ప్రాజెక్ట్
పోలవరం నిర్వాశితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
ఈనెల 18 న జరిగే సీపీఐ శత జయంతి ముగింపు సభకు తరలి రండి
సీపీఐ జాతీయ కార్యదర్శి సభ్యులు రామకృష్ణ పిలుపు
గన్నవరం లో సీపీఐ శత జయంతి సభ

న్యూస్ తెలుగు /చింతూరు : నిర్వాసితుల త్యాగ ఫలితమే పోలవరమనీ సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. గురువారం ఎటపాక మండలంలోని గన్నవరం లో సీపీఐ శత వార్షిక జయంతి సభ కందుకూరి స్వర్ణ, వాసం రాము అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా స్థానిక మెయిన్ రోడ్ నుండి సభ ప్రాంగణ వరకు ర్యాలీ గా సాగింది. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసేందుకు సర్వం త్యాగం చేస్తున్న పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చేంతవరకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. అందుకు నిర్వాదితులందరూ సిద్ధం కావాలన్నారు. వందేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ సీపీఐ అన్నారు.
బ్రతికుంటే సీపీఐ జెండా భుజం మీద చచ్చిపోతే సమాధి మీద అని అన్నారు. నిజమైన కమ్యూనిస్టు చచ్చిపోయినా తన ఆదర్శాలు మిగులుతాయని తద్వారా కమ్యూనిజం అజరామరం అవుతుందని ఉద్ఘటించారు. ఈనెల 18 న ఖమ్మం లో జరిగే సీపీఐ శత వార్షిక ముగింపు సభకు కార్యకర్తలు, అభిమానులు అందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. ముగింపు సభను జయప్రదం చేయాలని అన్నారు.
మానవ హక్కుల సాధన కోసం సమ సమాజ నిర్మాణం కోసం పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదని, భూమిపై మనిషి ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ సజీవంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు అన్నారు. పోరాటాల త్యాగ ఫలితమే సీపీఐ వందేళ్ల చరిత్ర అని జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ
అన్నారు. జాతీయ సమితి సబ్యులు
బాగం హేమంత్ రావు
గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, రాష్ట్ర సమితి సబ్యులు మునీర్ సమావేశం,
అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, ఏలూరి జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య , చింతూరు డివిజన్ కార్యదర్శి గుజ్జ మోహన్ రావు, సహాయ కార్యదర్శి వాసం రాము, ఎస్కే రంజన్, గన్నవరం ఎంపీటీసీ కంటే రాజు, సర్పంచ్ గడ్డం భద్రమ్మ, కూనవరం మండల కార్యదర్శి లంబు శ్రీను, వి ఆర్ పురం మండల కార్యదర్శి, కర్నాటి ఏసు, నాగరాజు,
తూర్రం మురళి, సీనియర్ నాయకులు సూర్య చంద్రవ్రావు, వరద బ్రహ్మం, వేలేరు పాడు మండల కార్యదర్శి బాదిశా రాము, వెంకట చారి, లక్ష్మయ్య, సురేష్ బాబు, శ్యామల, జుట్టుక కుమార్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. (Story:నిర్వాసితుల త్యాగ ఫలితమే పోలవరం ప్రాజెక్ట్)

