చంద్రబాబు నాయుడి పాలనా దక్షతతో ఏపీ కి జాతీయ గుర్తింపు: జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో జరుగుతున్న ఆర్ధిక, పారిశ్రామిక, సాంకేతిక మార్పులకు భారతదేశ స్థాయి గుర్తింపు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీకి ఆయా రంగాల్లో జాతీయ స్థాయి గుర్తింపు రావటం చంద్రబాబు నాయుడి అనుభవానికి, పాలనా దక్షతకి నిదర్శనమని చీఫ్ విప్ జీవీ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ఒక ప్రముఖ పత్రిక, ఇటీవల ప్రచురించిన కథనంలో ఆంధ్రప్రదేశ్‌లో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ” వేగంగా మెరుగవుతున్నదని విశ్లేషించటంపట్ల జీవీ గురువారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
నూతన విధానాలు, పారదర్శక పాలన, పెట్టుబడుల సేద్యం, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాలలో జరుగుతున్న వాస్తవ మార్పులను ఆ కథనం ప్రస్తావించిందని ఇది ఏపీ లో కూటమి పాలన ప్రగతికి నిదర్శనం అని పేర్కొన్నారు. గతంలో మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌ను ఐటీ మరియు ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దిన దృష్టికి, ఇప్పుడు యువనాయకుడు మాన్య ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో అదే దిశగా ఆంధ్రప్రదేశ్ తిరిగి దూసుకెళ్తోందని పేర్కొన్నారు.
దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ను ఉద్యోగ సృష్టి, పెట్టుబడులకు అనుకూలమైన, పారదర్శక పాలన కలిగిన రాష్ట్రంగా చూస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఐటీ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని
ఈ గుర్తింపు రాష్ట్ర యువతలో కొత్త ఆశలు నింపుతోందని, ఆత్మవిశ్వాసం పెంచుతోందని శ్రీ ఆంజనేయులు గారు పేర్కొన్నారు. పాలనా మార్పులు, వేగవంతమైన నిర్ణయాలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం — భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ను మరింత శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా నిలబెట్టబోతున్నాయని తెలిపారు.(Story:చంద్రబాబు నాయుడి పాలనా దక్షతతో ఏపీ కి జాతీయ గుర్తింపు: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు)

