విద్యా వికాస్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు పాల్గొన్న జీవి
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డు విద్యా వికాస్ స్కూల్ ఆవరణలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు జీవి కి ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల ప్రాంగణమంతా రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు మరియు గంగిరెద్దుల ఆటలతో సందడిగా మారింది. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. నేటి ఆధునిక కాలంలో పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడం ఎంతో అవసరమని అన్నారు. పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా పాఠశాలలో ఇటువంటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు మన మూలాలను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసేన నాయకులు నిశ్శంకర శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.(Story:విద్యా వికాస్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు పాల్గొన్న జీవి)

