చలో ఖమ్మం..
ఖమ్మంలో జరిగే సిపిఐ 100 సంవత్సరాల వార్షికోత్సవాలను జయప్రదం చేయండి.
మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి.
న్యూస్ తెలుగు/వినుకొండ : తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. స్థానిక ఆజాద్ నగర్ లో ఝాన్సీ లక్ష్మి కొమరం భీమ్ డివిజన్లోని శాఖల సమావేశాలకు కామ్రేడ్ వులవలపూడి రాము అధ్యక్షత వహించగా సమావేశాలకు అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల పార్టీ కమిటీల నిర్ణయం మేరకు తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో సిపిఐ శత వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఉమ్మడి రాష్ట్ర పార్టీలు నిర్ణయించిన నేపద్యంలో ఐదు లక్షల మంది పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించబోతు న్నారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాట జ్వాలల్లో ఏర్పడిన సిపిఐ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి దేశ ప్రజలకు విదితమే బ్రిటిష్ క్రూర పోలీసు మూకలు ఆనాటి కమ్యూనిస్టు పార్టీ అన్న యువతీ యువకులను చిత్రహింసలకు గురిచేశారు లక్షలాదిమంది జైళ్ళ పాలయ్యారు రహస్య జీవితాలను గడపాల్సి వచ్చింది, సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపునిచ్చిన మొట్టమొదటి ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో పేద బడుగు బలహీన వర్గాలు కార్మికులు కష్టజీవులు రైతాంగ రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం భూ పోరాటాలను సిపిఐ ఉధృతంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రభుత్వ భూములు సీలింగ్ భూములను పేదలకు పంచుతున్న పరిస్థితుల్లో ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు భూస్వామిగా వారసత్వంగా తనకు సంక్రమించిన భూములు 400 ఎకరాలు మొత్తం పేదలకు పంచి వేశారు. సిపిఐ పోరాటాల ఫలితంగా దేశంలో అనేక కీలక రంగాల్లో ఇనుము ఉక్కు తో సహా చమురు శుద్ధి కర్మాగారాలు నూలు పరిశ్రమలు యూనివర్సిటీలు బొగ్గు గనులు రైల్వే కర్మాగారాలు అనేక పరిశ్రమలు 80% పైగా ప్రభుత్వ రంగంలో స్థాపించబడ్డాయి రాజభరణాలు రద్దు చేయాలని బ్యాంకులను ఇతర కీలక రంగాల్లోని భారీ పరిశ్రమలను జాతీయం చేయాలని పోరాటాలు చేసి విజయం సాధించింది, సీలింగ్ భూములు ప్రభుత్వ బంజరు రియల్ ఎస్టేట్ బకాసుల కబంధహస్తాల నుండి కాపాడడానికి పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ అవకాశం ఉన్నచోట పేదలకు పంచి పెడుతూ పోరాడింది సిపిఐ. రాష్ట్రంలో 2014లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కట్టించిన టిడ్ కో ఇళ్లను అర్హులైన పేదలకు పంచాలని, పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు నివాస స్థలాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వమే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్రంలో విశాఖ ఉక్కు తో సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని పోరాడింది భారత కమ్యూనిస్టు పార్టీ. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఆదుకోవాలని నిర్వహిస్తున్న పోరాటాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సిపిఐ నిరంతర పోరాటాన్ని కొనసాగించిందన్నారు. పిపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ప్రచారము పోరాటాలకు సిద్ధం కావాలని ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సభ్యత్వాలు రెన్యువల్ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలో జరుగుతున్న సిపిఐ 100 సంవత్సరాల వార్షికోత్సవాలకు మన జిల్లా నుండి ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఇంకా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము కొప్పరపు మల్లికార్జున రావు దుర్గమ్మ రవణమ్మ కాశమ్మ గోవిందమ్మ నరసింహారావు బొట్టు శీను తదితరులు పాల్గొన్నారు.(Story : చలో ఖమ్మం.. )

