విశాలాంధ్ర కేలండర్లను ఆవిష్కరించిన సిఐ,ఎస్ఐలు
న్యూస్ తెలుగు/చింతూరు : 2026 సంవత్సరం విశాలాంధ్ర క్యాలెండర్లను చింతూరు సిఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల పట్ల అంకితభావంతో బేధ భావజాలం లేకుండా పోరాడే పత్రిక విశాలాంధ్ర అని పేర్కొన్నారు. ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ విశాలాంధ్ర పత్రిక చాలా ప్రసిద్ధిగాంచిన పత్రిక అని, దినదినాభివృద్ధి చెంది పేద ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రజలందరూ విశాలాంధ్ర పత్రికను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : విశాలాంధ్ర కేలండర్లను ఆవిష్కరించిన సిఐ,ఎస్ఐలు)

