నూతన సంవత్సరంలో కొత్త విషయాలు నేర్చుకోవాలి. సి. ఐ గోపాలకృష్ణ.
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు పోలీస్ స్టేషన్ లో సర్కిల్ కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు గురువారం సిఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో సిబ్బంది అంతా తమ ఆలోచనలు కొత్త కొత్తగా ఉండాలని, చెడు అలవాటులను దూరం చేసుకుని, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించాలని, ఆరోగ్యానికి యోగ నేర్చుకోవాలని, అలాగే ఈత నేర్చుకోవాలన్నారు. ప్రతి విషయంలోనూ కంప్యూటర్ అనుసంధానం అయినందున కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోవాలన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ, విధినిర్వహణలో మొదటి శ్రేణి లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లికార్జున్,యం. కొనం దొర తదితర సిబ్బంది పాల్గొన్నారు.(story : నూతన సంవత్సరంలో కొత్త విషయాలు నేర్చుకోవాలి. సి. ఐ గోపాలకృష్ణ. )

