Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  ఫ్లెక్సీలు తొలగింపు పై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసిపి కౌన్సిలర్ ధ్వజం

 ఫ్లెక్సీలు తొలగింపు పై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసిపి కౌన్సిలర్ ధ్వజం

0

 ఫ్లెక్సీలు తొలగింపు పై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసిపి కౌన్సిలర్ ధ్వజం

న్యూస్ తెలుగు /వినుకొండ : మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగింది. అజెండాలోని అంశాలను చదువుతున్న సమయంలో
, వైసిపి కౌన్సిలర్ వైస్ చైర్మన్ బేతం గాబ్రియేల్, టి రాజేష్ కన్నా, ఎం. ఎస్.కే. భాషా, పి బ్రహ్మయ్య,  మరికొందరు ఆగ్రహిస్తూ పండుగ సందర్భంగా  ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు ఎందుకు తొలగించారు, అధికార పార్టీ వారి బ్యానర్ లో ఎలా ఉంచారు అంటూ ఆగ్రహించారు. అలాగే వార్డుల్లో జరిగే కార్యక్రమాలకు ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. వర్కులకు,  శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ జరిగే కార్యక్రమాలకు కౌన్సిలర్ల కు సమాచారం పంపటం లేదని వారు ఆగ్రహించారు. కౌన్సిలర్ల పదవీకాలం మూడు మాసాలు మాత్రమే ఉన్నదని,  ఏమాత్రం గౌరవించడం లేదని వారు అన్నారు. గతంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు వేసి వాటిపై కౌన్సిలర్ల ఫోటోలు వేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసే వారిని, ఇప్పుడు ఆ సంస్కృతి లేకుండా చేసి ఇష్టం వచ్చిన రీతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారని వారు ఆగ్రహించారు. కాగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి కూడా వారితో గొంతు కలుపుతూ పట్టణంలో హోర్డింగులకు మాత్రమే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని డబ్బు చెల్లించాలని అన్నారు. ,  ఫ్లెక్సీలకు అనుమతి ఉండదని,  ఎవరికి ఇష్టం వచ్చినట్లు వేసుకుంటున్నారని అన్నారు. అలాం టప్పుడు. ఒకరివి ఫ్లెక్సీలు ఉంచి మరొకరివి ఎందుకు తొలగించారంటూ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను ప్రశ్నించారు. దీంతో ఆయన మాట్లాడుతూ.  వైసీపీ వర్గం వారి ఫ్లెక్సీలు తొలగించే సమయంలో నాలుగు రోజులు తాను లేనని,  కింది స్థాయి ఉద్యోగులు వర్కర్స్ తొలగించారని సమాధానం ఇచ్చారు. దీంతో మరింత ఆగ్రహించిన కౌన్సిలర్లు ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం ఏంటని  మున్సిపల్ చైర్మన్ పై మండిపడ్డారు. అలాగే మున్సిపల్ కమిషనర్,  ఎమ్మెల్యే, కొందరు ఉద్యోగుల ఫోటోలుతో ఫ్లెక్సీలు వేస్తున్నారని, అందులో తన ఫోటో మాత్రం కనబడదని, అలాంటప్పుడు ఆ ఫ్లెక్సీలు తాను ఎందుకు అనుమతించాలంటూ మున్సిపల్ గేటు వద్ద చైర్మన్ దస్తగిరి కొద్దిసేపు వీరంగం చేశారు. ఇక ప్రభుత్వ లైబ్రరీ అండర్ గ్రౌండ్ భవనంలో అధ్వానంగా ఉండి వర్షాకాలంలో నీరు చేరి మరింత అద్వానంగా మారుతుందని కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. దీంతో కౌన్సిలర్ షకీలా జోక్యం చేసుకొని లైబ్రరీ మరో ప్రాంతానికి మార్చాలని ఎమ్మెల్యేని కోరామని, అయితే అద్దెలు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ కార్యక్రమం అలా ఆగిపోయిందని, అయితే ఎన్ఎస్పీలో లైబ్రరీ భవనం నిర్మాణం చేసేందుకు,  నిర్మించేందుకు 15 సెంట్లు స్థలం జిల్లా కలెక్టర్ ను అడిగామని, స్థలం మంజూరు చేస్తే ఉన్న కొద్దిపాటి నిధులతో నిర్మాణాలు ప్రారంభిస్తామని,  తర్వాత నిధులు మీరు మంజూరు చేయాలని కోరామని, దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించిందని,  కౌన్సిలర్ షకీలా ఈ సందర్భంగా వివరించారు. ఇక చివరగా వచ్చే పండుగలకు తాము ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అని కౌన్సిలర్లు కమిషనర్ ను అడగ్గా ఆయన సానుకూలంగా స్పందించారు. కౌన్సిలర్లు రెడ్డి నాగ పద్మ, గంట కాలేషా మాట్లాడుతూ.  తమ వార్డుల్లో ఐరన్ విద్యుత్ స్తంభాలు తుప్పుబట్టి శిథిలావస్థకు చేరుతున్నాయని, ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంది అని,  ఎన్ని మార్లు సమావేశాల్లో మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని మరోసారి ఆగ్రహించారు. కాగా అజెండాలోని  14 అంశాల్లో 9 వ అంశం వాయిదా వేస్తూ మిగతావన్నీ కౌన్సిల్ ఆమోదించినట్లు చైర్మన్ దస్తగిరి ప్రకటించారు. (Story: ఫ్లెక్సీలు తొలగింపు పై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసిపి కౌన్సిలర్ ధ్వజం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version