Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 3.20 కోట్లు కేటాయింపు: జీవి

వినుకొండ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 3.20 కోట్లు కేటాయింపు: జీవి

0

వినుకొండ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 3.20 కోట్లు కేటాయింపు: జీవి

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ర్. నాయుడు ₹3.2 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి మంగళవారం శ్రీ వారిని దర్శించుకున్న అనంతరం టిటిడి చైర్మన్ బి.ర్. నాయుడు ని కలిసి వినకొండ టిటిడి కళ్యాణమండపం నిధులు కేటాయింపు పై చర్చించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 3.2 కోట్లు విధులు కేటాయింపుకు ఆమోదం తెలిపారని, టీటీడీ నుండి నిధులను విడుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వినుకొండలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబు నాయుడు కి, చైర్మన్ బి ఆర్ నాయుడుకి చీఫ్ విప్ జీవి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే…. వినుకొండ నియోజకవర్గం లో 7 దేవాలయాల నిర్మాణానికి శ్రీ వాణి ట్రస్టు ద్వారా నిధులు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి…

టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్టు ద్వారా నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తుంది. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం, వెంకటరెడ్డి పురం, ఈపూరు మండలం కొత్త నెల్లూరు, వినుకొండ మండలం విఠం రాజు పల్లి, జాలలపాలెం, నూజెండ్ల మండలం మూర్తింజయపురం, పెద్దారం గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, రామాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులకై ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మంగళవారం టిటిడి చైర్మన్ డి.ఆర్ నాయుడును కోరారు. స్పందించిన టిటిడి చైర్మన్ ఏడు గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని దేవాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చిన చైర్మన్ బిఆర్ నాయుడుకి చీఫ్ విప్ జీవి  అభినందనలు తెలిపారు.   (Story:వినుకొండ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 3.20 కోట్లు కేటాయింపు: జీవి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version