Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రారంభమైన గీతాంజలి స్కూల్స్ వారి సిల్వర్ జూబ్లీ వేడుకలు 

ప్రారంభమైన గీతాంజలి స్కూల్స్ వారి సిల్వర్ జూబ్లీ వేడుకలు 

ప్రారంభమైన గీతాంజలి స్కూల్స్ వారి సిల్వర్ జూబ్లీ వేడుకలు 

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ వారు పాఠశాల ప్రారంభించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభించారు. వేడుకలు ప్రారంభోత్సవ సందర్బంగా పట్టణంలో హైడ్రోజన్ బలూన్ లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తేళ్ళ కృష్ణవేణి మాట్లాడుతూ.. తమ పాఠశాల ప్రారంభించి ఈ విద్యా సంవత్సరానికి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను 2026 జనవరి 9,10,11 తేదిలలో నిర్వహిస్తున్నామని, 9న రెసిడెన్సియల్ విద్యార్థులకు, 10న 25 సంవత్సరాలలో తమ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మరియు 11న డే -స్కాలర్స్ కొరకు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ తప్పక విచ్చేసి ఈ వేడుకలు జయప్రదం చెయ్యాలని కోరారు. ఈ వేడుకలు ప్రారంభోత్సవ సందర్బంగా చిన్నారులు సిల్వర్ జూబ్లీ చిహ్నంగా వేసిన 25 అను మానవహారం చూపరులను విశేషంగా అల్లరించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ యెండ్లూరి శేషగిరి రావు, కారాస్పాండంట్ యెండ్లూరి లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : ప్రారంభమైన గీతాంజలి స్కూల్స్ వారి సిల్వర్ జూబ్లీ వేడుకలు  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments