క్రీడల శాఖ మంత్రి సి సి ఏ కు క్రికెట్ కిట్స్ పంపిణీ
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు క్రికెట్ అసోసియేషన్(సి సి ఎ) క్రీడాకారులకు క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్రికెట్ కిట్లను పంపారు. ఆ క్రికెట్ కిట్లను డిడిఓ విజయ్ కుమార్ గురువారం చింతూరు క్రికెట్ గ్రౌండ్ లో సి సి అసోసియేషన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ కిట్లను పంపించిన స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డికి, తమకు అందజేసిన డి డి ఓ కి చింతూరు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కణితి గణేష్, బుచ్చిరాజు, పాల్వంచ రవి, మడివి. రాజు, షాహిద్, స్టీఫెన్, బిట్టు, ప్రదీప్, ప్రవీణ్, గంగు తదితర సభ్యులు పాల్గొన్నారు.(Story : క్రీడల శాఖ మంత్రి సి సి ఏ కు క్రికెట్ కిట్స్ పంపిణీ )

