Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నూతనంగా ఎన్నికైనఅయ్యవారిపల్లె పెద్ద మునగల్ షెడ్ సర్పంచులను సన్మానించిన

నూతనంగా ఎన్నికైనఅయ్యవారిపల్లె పెద్ద మునగల్ షెడ్ సర్పంచులను సన్మానించిన

0

నూతనంగా ఎన్నికైనఅయ్యవారిపల్లె పెద్ద మునగల్ షెడ్ సర్పంచులను సన్మానించిన

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

న్యూస్ తెలుగు/వనపర్తి : అయ్యవారిపల్లె , పెద్ద మునగల్ షెడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా కురుమూర్తి, చిట్టి బాబు ఘన విజయం సాధించి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ మరియు వార్డు సభ్యులను చిన్నా రెడ్డి గారు శాలువాలతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ప్రజల మద్దతుతో లభించిన విజయం కేవలం పదవి మాత్రమే కాదని, అది ప్రజలు అప్పగించిన గొప్ప బాధ్యత అని అన్నారు. గ్రామ ప్రజలు మీపై ఉంచిన విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా, ప్రతి గడపకు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా అంకితభావంతో పని చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర టిపిసిసిప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, ఉప సర్పంచ్ తారక వెంకన్న యాదవ్, అంజి రెడ్డి,ఆనంద్ సాగర్, వెంకటరత్నం, మన్యం సాగర్, చంద్రశేఖర్, కోళ్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.(Story :నూతనంగా ఎన్నికైనఅయ్యవారిపల్లె పెద్ద మునగల్ షెడ్ సర్పంచులను సన్మానించిన )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version