విద్యుత్ భద్రత వారోత్సవాల ర్యాలీ
న్యూస్ తెలుగు /చింతూరు :
చింతూరు విద్యుత్ భద్రత వారోత్సవాలలో భాగంగా చింతూరు ఐటిడిఎ నుండి చింతూరు సెంటర్ వరకు విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులు కలిసి ర్యాలీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చింతూరు ఐటిడిఎ పి ఓ శుభం నక్వాల్ జెండా ఊపి ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో రంపచోడవరం డి ఇ బి.వెంకటరమణ చింతూరు ఏడీఈ, ఎ ఇ.విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం చింతూరు ఈ పి డి సి యల్ సబ్ డివిజన్ నందు సోలార్ పి యం సూర్యఘర్ రూఫ్ టాప్ కార్యక్రమంలో చింతూరు విద్యుత్ వినియోగదారులతో సోలార్ యొక్క ప్రాముఖ్యత మరియు సబ్సిడీ మరియు లోన్ లు ఎలా తీసుకోవాలి అనే అవగాహన కార్యక్రమం రంపచోడవరం డిఈ ఏర్పాటు చేసి నేరుగా బ్యాంకు మేనేజర్ లతో వినియోగదారులకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించటం జరిగింది.ఈ కార్యక్రమంలో చింతూరు యస్ బి ఐ బ్యాంక్ మేనేజర్.యూనియన్ బ్యాంకు మేనేజర్.సోలార్ వెన్డర్స్ .చింతూరు ఎ డి ఇ, ఎ ఈ, గణేష్.విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు (Story:విద్యుత్ భద్రత వారోత్సవాల ర్యాలీ)

