Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చెత్త నుండి సంపదపై అవగాహన

చెత్త నుండి సంపదపై అవగాహన

0

చెత్త నుండి సంపదపై అవగాహన

న్యూస్ తెలుగు /చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కె.పి.చంద్ర శేఖర్ చిడుమూరు గ్రామ పంచాయతీని సందర్శించడమైనది. చిడుమూరు గ్రామస్తులకు తడి చెత్త పొడి చెత్త సేకరణ, ఐవిఆర్ఎస్ సందేశములపై అవగాహన కల్పించారు. అనంతరం చిడుమూరు గ్రామ పంచాయతీ లొనీ అసంపూర్తిగా ఉన్న సచివాలయమును పరిశీలించి కార్యాలయపు విధులు చేయుటకు మరమ్మతులు తక్షణమే చేయించవలసినదిగా పంచాయతీ కార్యదర్శి గోపాలకృష్ణ ను ఆదేశించారు.ఈ పర్యటనలో భాగంగా చిడుమూరు, చింతూరు చెత్త నుండి సంపద కేంద్రాలను చట్టి సచివాలయ భవనమును పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయము లో డివిజన్ పరిధిలోని 4 మండలాల ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ లు పంచాయతీ కార్యదర్శులకు డివిజన్ అభివృద్ధి అధికారి, ద్వారా ఇంటి పన్నుల వసూలు, సచివాలయ భవనాల పనులు పి ఆర్ వన్ యాప్ భాద్యతలు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో చింతూరు డివిజన్ అభివృద్ధి అధికారి విజయ్ కుమార్ 4 మండలాల డిప్యూటీ ఎంపీడీఓ లు,ఏ ఈ ఆర్ డబ్ల్యూ యస్ , ఎ ఈ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు హాజరైయ్యారు. (Story:చెత్త నుండి సంపదపై అవగాహన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version