Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చంద్రజిత్ యాదవ్

ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చంద్రజిత్ యాదవ్

0

ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చంద్రజిత్ యాదవ్

న్యూస్ తెలుగు / వినుకొండ : కడపలో జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘం – ఆంధ్రప్రదేశ్ 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం మరియు ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహిచారు. ఈ ఎన్నికలలో వినుకొండ ప్రాంతం నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యు చంద్రజిత్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. వారిని రాష్ట్ర కార్యవర్గం, పల్నాడు జిల్లా అధ్యక్షులు రామి రెడ్డి, ప్రధాన కార్యదర్శి యమండి, ఆర్థిక కార్యదర్శి సుభాని, గౌరవ అధ్యక్షులు యేసయ్య, జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ బిల్లా రాజా రమేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వేముల ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి కొంగ వెంకటేశ్వర్లు, యోగేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ గంట నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరత్నం, జిల్లా కార్యదర్శి కృపాదాసు, వినుకొండ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు, ఈపూరు మండల అధ్యక్షులు జి ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శి మద్దం వెంకటేశ్వర్లు, శావల్యాపురం అధ్యక్షుడు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి చెంచులక్ష్మీ, నూజెండ్ల అధ్యక్షులు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి బొల్లాపల్లి అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి జేమ్స్ అభినందనలు తెలిపారు. సంఘంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపాధ్యాయ లోకానికి ఎనలేని సేవ చేయాలని ఆకాంక్షించారు. వినుకొండ ప్రాంతం నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా చంద్రజిత్తు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం తనకు ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహిస్తానని, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయుల మీద ఉన్న ఒత్తిడిని తగ్గించాలని చంద్రజిత్ యాదవ్ డిమాండ్ చేశారు.(Story:ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చంద్రజిత్ యాదవ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version