Homeవార్తలుతెలంగాణకేసీఆర్ పాలన దేశానికి గ్రేట్

కేసీఆర్ పాలన దేశానికి గ్రేట్

కేసీఆర్ పాలన దేశానికి గ్రేట్

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికి గ్రేట్ అని మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రం లో మాజీ మంత్రి స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించారు. నేడు కాంగ్రెస్ పాలనలో అన్నీ రంగాలు ఆదోగతి పాలు విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హామీ లు అమలు చేస్తే ఎప్పుడో ఎన్నికలు పెట్టేవారు అని విమర్శించారు. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ ముందు వుంటుందని చెప్పారు. హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్న విషయం వాళ్లకు తెలుసుఅని చెప్పారు. కానీ ఎన్నికల్లో లబ్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అని మాజీ మంత్రి విమర్శించారు. ఇవాళ హామీల అమలు సమయం వచ్చేసరికి ఎవరూ మాట్లాడలేదని అన్నారు . 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని విమర్శించారు. అరవై మంది గురుకులాల్లో చదివే విద్యార్థులు మృతి చెందారుఅని , చేనేత కార్మికులు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారుఅని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వ.ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం కేసీఆర్ ఇచ్చారుఅని చెప్పారు. రెండేళ్ల నుండి రిటైర్మెంట్ బెనిఫిట్ లు ప్రభుత్వం అందజేయలేదు అని, ప్రభుత్వానికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటున్నారుఅని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగం రోడ్డెక్కింది.బోనస్, కరెంట్, నీళ్ళు,వడ్ల కొనుగోలు, రైతు బంధు, యూరియా కోసం రైతులను ఇబ్బంది పెట్టిందని అన్నారు . యాసంగి స్టార్ట్ అయింది. రైతు బంధు ఇస్తారో ఇవ్వరో చెప్పడం లేదుఅని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకటే సీజన్ లో రైతు బంధు వేసిందని, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు చేసి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం చేశారుఅని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినపుడు అధికార పార్టీ అభ్యర్థులు గెలవడం సహజంగా జరుగుతుందని, ప్రజల మన్ననలు పొందితే అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తుందని అన్నారు. ఎంత అధికార దుర్వినియోగం చేసిన బీ ఆర్ ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపారుఅని, సోలీపూర్ తీర్పు ఇందుకు ఉదాహరణగా ఉంటుందని.
కొంతమంది అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేశారు అని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చాలా చోట్ల ఏకగ్రీవం అయ్యారు అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు ప్రతి నియోజకవర్గంలో సర్పంచ్ స్థానాలు ఐదు నుండి పది శాతానికి మించి ప్రతిపక్షానికి రాలేదుఅని అన్నారు. మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే కాంగ్రెస్ తక్షణం ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని అన్నారు. తెలంగాణ కు కేంద్రం ఇచ్చిన అవార్డ్ లే కేసీఆర్ పాలనకు నిదర్శనం అని, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్ లో చాలా మంది తెలంగాణ అభివృద్ధిని కొనియాడారుఅనిఅన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు.
మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా రెండు మూడు విడతల్లో ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాను అని అన్నారు. పార్టీ కోసం కష్ట పడుతున్న నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,జిల్లా రైతు సమితి మాజీఅధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి,మాజీ ఎం.పి.పి.కృష్ణా నాయక్,చంద్రశేఖర్ నాయక్,వేణుగోపాల్,మాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్,ప్రేమ్ నాథ్ రెడ్డి,గులాం ఖాదర్ ఖాన్,ఇమ్రాన్,బొబ్బిలి.ప్రేమ్ కుమార్,సయ్యద్.జమీల్,నందిమల్ల.సుబ్బు,మంద.రాము,సూర్యవంశం.మునికుమార్,నీలస్వామి,పెద్ద ముక్కల.రవి,జె.శ్రీనివాసులు,అలీమ్,నవాజ్,విశాల్ తదితరులు పాల్గొన్నారు. (Story:కేసీఆర్ పాలన దేశానికి గ్రేట్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!