Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు మద్దతు

ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు మద్దతు

0

ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు మద్దతు

ఏఐవైఎఫ్ ఏపీ సమైక్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సంతోషకుమార్

న్యూస్ తెలుగు/అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు మద్దతు ను ఏఐవైఎఫ్ ఏపీ సమైక్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సంతోషకుమార్ తెలియజేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ యువజన సమైక్య ( ఏఐవైఎఫ్ ) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య సంతోష్ కుమార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మసిస్టుల వృత్తి హక్కులు, గౌరవం, భద్రత గత కొన్నేళ్లుగా తీవ్రంగా దెబ్బతిన్నాయి అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు – 2025 లో నిజమైన మార్పు తీసుకురా గల ఏకైక బృందం ఏపీ ఫార్మా జేఏసీ (ఏపీ ఫార్మా జేఏసీ) మాత్రమే దక్కిందన్నారు . అందుకే అఖిల భారతీయ యువజన సమైక్య తరఫున మేము ఈ ప్యానెల్‌కు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు.గత 15–16 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా కౌన్సిల్‌ను అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యానికి కేంద్రంగా మార్చిన పరిస్థితుల్లో—ఫార్మసిస్టుల కోసం క్షేత్రస్థాయిలో పోరాడిన, నకిలీ రిజిస్ట్రేషన్ల నిర్మూలన కోసం కఠినంగా డిమాండ్ చేసిన, టూ–ప్లేసెస్ వర్కింగ్ సమస్యతో వేలాది ఫార్మసిస్టులు పడిన ఇబ్బందులను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేసిన బృందం ఏపీ ఫార్మా జేఏసీ మాత్రమే చేయగలదన్నారు..ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం పునరుద్ధరణ కోసం ప్రకటించిన ‘లక్ష సాధన – 6 హామీలు’ పూర్తిగా ఆచరణ సాధ్యమైనవి, ఫార్మసిస్టుల భవిష్యత్తును మార్చగలదన్నారు.
ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ అభ్యర్థులు గా 6 – ఈ. పెంచల నరసింహులు, 10 – గుత్తం జగదీష్,14 – కొర్ర దేవేంద్ర నాయక్,27 – ఆర్. ప్రకాసరావు,28 – ఆర్. శ్రావణ్ కుమార్,32 – షేక్ హసన, ఉన్నారని తెలిపారు. “ఫార్మసిస్టులందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
బ్యాలెట్ పేపర్‌లో గరిష్టంగా ఆరు మంది అభ్యర్థులకు మాత్రమే ‘X’ గుర్తు పెట్టాలన్నారు.
మూడు కవర్లను సూచించిన విధంగా నింపి, స్పీడ్ పోస్టు ద్వారా సమయానికి పంపాలన్నారు.
మీ ఒక్క ఓటు—ఫార్మసీ వృత్తి భవిష్యత్తును నిర్ణయించే కీలక శక్తి.ఫార్మసిస్టుల హక్కుల కోసం, వృత్తి గౌరవం కోసం, పారదర్శక పరిపాలన కోసం—ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్‌ను గెలిపించాలని అని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కావాలి కొట్రేస్, నగర అధ్యక్షుడు కార్యదర్శి ఎం ఆనంద్, ఎస్ శ్రీనివాసులు, నగర నాయకులు సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.(Story : ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు మద్దతు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version