Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై ప్రత్యేక సదస్సు

వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై ప్రత్యేక సదస్సు

0

వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై ప్రత్యేక సదస్సు

న్యూస్ తెలుగు/అనంతపురం : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్(స్పీఫ్), డి ఎం ఈ మరియు ఏపీ & అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సహకారంతో రెండు రోజుల పాటు మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై మంగళవారం అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎం విజయ శ్రీ మాట్లాడుతూ… వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎమోషనల్ అసెస్మెంట్ ఇన్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్ ప్రాజెక్టు(ఈ ఏ ఎస్ ఈ) సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎస్ షారోన్ సోనియా మాట్లాడుతూ… ఒత్తిడిని అధిగమించి రోజువారి సవాళ్లను ఎదుర్కోనే దిశగా దృష్టి పెట్టాలని విద్యార్థులను కోరారు. బెంగళూరుకు చెందిన ఎస్ పి ఐ ఎఫ్ ఫౌండర్ డాక్టర్ నెల్సన్ వినోద్ మోసెస్ మాట్లాడుతూ… వైద్య విద్యార్థులు చదువు ఒత్తిడి వలన భావోద్వేగాలకు లోనవుతున్నారని, మానసిక సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తించి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణులకు తెలియజేయడం వలన పరిష్కారం లభిస్తుందని సూచించారు. సైకియాట్రి విభాగాధిపతి డాక్టర్ శారద మాట్లాడుతూ… ఒత్తిడి, నిరాశ, ఆందోళన వలన ఆత్మహత్య భావాలు తలెత్తినప్పుడు నిపుణులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరదరాజులు, డాక్టర్ రవి కుమార్ డాక్టర్ హవీలా డాక్టర్ శ్రీధర్, డాక్టర్ స్వాతి, డాక్టర్ లలితా భవాని, డాక్టర్ ఎల్లమ నాయుడు , పీజీలు పాల్గొన్నారు.(Story :వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై ప్రత్యేక సదస్సు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version