భూమి ఆరోగ్యం, భూసారంపై రైతులకు అవగాహన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, నీలగంగవరం గ్రామం లో గ్రామ పంచాయితీ కార్యాలయం నందు మంగళవారం రైతులకు భూమి ఆరోగ్యం మరియు భూసారం పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత పి.వి.సత్య గోపాల్ పాల్గొని మాట్లాడుతూ. దుక్కి లో వేపపిండి వేసుకోవడం వలన నేల ద్వార వ్యాప్తి చెందే తెగుళ్లను అలాగే నెలలో ఉన్న కోశస్థ దశల్లో ఉన్న పురుగుని కూడా అరికొట్టుకోవచ్చని అన్నారు. అలాగే మొక్కజొన్న లో సమగ్ర యాజమాన్యం ను వివరించారు. జిల్లా శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి యం. అరుణ మాట్లాడుతూ. సేంద్రియ పద్ధతిలో భూసారాన్ని పెంపొందించుకోవాలంటే పచ్చి రొట్ట పైర్లు, పంట అవశేషాలను కాల్చి వెయ్యకుండా కుళ్ళ బెట్టుకోవాలని, అలాగే జీవన మందుల వాడకం వలన రసాయన మందుల వాడకం 20% తగ్గుతుందని అన్నారు. మండల వ్యవసాయ అధికారి జి. వరలక్ష్మీ మాట్లాడుతూ.. నెలలో సేంద్రీయ కర్బనం పెంచుకో వాలని అన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయక గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.(Story : భూమి ఆరోగ్యం, భూసారంపై రైతులకు అవగాహన )
