Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్ సూచనకు స్పందించిన

మంత్రి నారా లోకేష్ సూచనకు స్పందించిన

0

మంత్రి నారా లోకేష్ సూచనకు స్పందించిన

టిడిపి కార్యకర్తకు సాయం చేస్తానని హామీ..

న్యూస్ తెలుగు/వినుకొండ  : యువ నేత, మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్పందించారు. బొల్లాపల్లి మండలం గరికపాడు టిడిపి గ్రామ ప్రెసిడెంట్ రామారావు పార్టీ కోసం పని చేశానని, అన్ని పోగొట్టుకున్నానని, పార్టీ అంటే ప్రాణమని, ఇల్లు లేక, ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకునే ఆర్థిక స్థోమత లేక కష్టాల్లో ఉన్నానని మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లారు. టిడిపి కార్యకర్త రామారావు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూడాలని మంత్రి లోకేష్ బాబు ట్విట్టర్ వేదికగా చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కు సూచించారు. వెంటనే స్పందించిన జీవి ఆంజనేయులు గరికపాడు టిడిపి కార్యకర్త రామారావును కలిసి వారి సమస్యలను, కష్టాలను విన్నారు. పిల్లల చదువు నిమిత్తం వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం ద్వారా సొంత ఇల్లు కట్టిస్తానని టిడిపి కార్యకర్త రామారావు కుటుంబానికి భరోసానిచ్చారు. వినుకొండ నియోజకవర్గంలో ఏ టీడీపీ కార్యకర్తకు సమస్య వచ్చిన పరిష్కరించేందుకు తాను అండగా ఉండాలని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యకర్తలకు మాట ఇచ్చారు.(Story : మంత్రి నారా లోకేష్ సూచనకు స్పందించిన )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version