మావోయిజం వద్దు – అభివృద్దే ముద్దు
మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజన యువత నినాదాలు : భారీ ర్యాలీ
న్యూస్ తెలుగు /చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలోగురువారం మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజన యువత భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిజం వద్దు అభివృద్ధి ముద్దు, ఇన్ ఫార్మర్ల నెపంతో అమాయకులను చంపొద్దు నినాదాలు చేశారు. చింతూరుబస్టాండ్ నుండి మెయిన్ సెంటర్ మీదుగా చింతూరు శబరి బ్రిడ్జి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అమాయకులైన ఆదివాసీలను ఇన్ఫార్మర్ల నేపంతో హత్యలు గావిస్తున్న మావోయిస్టులను పూర్తిగా వ్యతిరికించారు. అభివృద్ధికి అడ్డుపడుతూ అనేక విధ్వంసాలకు పాల్పడుతున్నారని దీని వలన గిరిజన గ్రామాలకు రోడ్డు,బస్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సమాచార ప్రతినిధులుగా గిరిజనులను మట్టు పెడుతున్నారంటూ ఇది అన్యాయమని నినాదాలు చేశారు. వారి ఉనికిని చాటుకోవటానికి దారి వెంట వస్తువెళుతున్న వాహనాలను దగ్ధం చేయటం, రోడ్డు నిర్మాణానికి వచ్చిన యంత్రాలను తగలబెట్టడం మంచిది కాదని మారు మూల గ్రామాలకు దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేరడం లేదని నినాదాలు చేశారు. మావోయిస్టుల సిద్ధాంతాలకు, ప్రభావాలకు లొంగకుండా ప్రజా సంక్షేమానికి పాటుపడాలని మావోయిస్ట్ పీపుల్స్ లిబరేషన్ గేరిల్లా ఆర్మీ వారోత్సవాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మారుమూల గ్రామ గిరిజన యువతతో పాటు, స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story:మావోయిజం వద్దు – అభివృద్దే ముద్దు)

