Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌5 వ,షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసి పూజర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

5 వ,షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసి పూజర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

5 వ,షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసి పూజర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

ఎస్టి కమిటీ చైర్మన్ కు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ వినతి:ఎ వి యస్ పి

న్యూస్ తెలుగు/చింతూరు : ఆదివాసి పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలని ఐదు షెడ్యూల్ ప్రాంతాలలోనే ఆదివాసి గ్రామాలకు ఐటీడీల,గిరిజన మంత్రిత్వ శాఖ ద్వారా ఆదివాసులు హిందువులు కాదు కాబట్టే వారి యొక్క దేవాలయాలను అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఇవ్వాలని అన్నారు. హిందువులు కాదు? ముస్లింలు కాదు? క్రైస్తవులు కాదు?కావున ప్రకృతిగా ఆరాధకులు గుర్తిస్తూ పైన పేర్కొన్న మతాలకు మత గురువులకు కల్పించే సంక్షేమ పథకాలను కల్పించడం ద్వారా ఆదివాసి గ్రామాలలో ఉన్న ఆదివాసి దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఎస్టి కమిటీ చైర్మన్ గారికి కమిషనర్ గారికి వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వివరించడం జరిగిందని పేర్కొన్నారు.
ఆదివాసి కల్లుగీత కార్మికులకు బీమా *సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రాంతాలలోని అన్ని షెడ్యూల్ ప్రాంతాలలోనే కల్లుగీత కార్మికులకు కార్మికులకు సొసైటీలు ఏర్పాటు చేసి వారికి బీమా సదుపాయాన్ని కల్పించాలని తాటి చెట్టు ఇప్పచెట్టు చెట్ల వలన అడవిలో లభించే ఉత్పత్తుల ద్వారా ఆదివాసి యువతీ యువకులకు ఏజెన్సీ ప్రాంతాలలోనే ఉపాధి కల్పించే విధంగా ఐటీడీఏ లో పనిచేస్తున్నసూచించారు. ప్రభుత్వ అధికారులు ప్రణాళికల రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు చేశారు.
షెడ్యూల్ ప్రాంతాలలో ఆదివాసి యువతీ యువకులకు ఉద్యోగ భద్రత చట్టాన్ని కల్పించాలి:* షెడ్యూల్ ప్రాంతాలలోని ఆదివాసి యువతీ యువకులకు విద్యాబుద్ధులు నేర్పించి బిఈడి ,డీఈడీలు చేయించిన విద్యార్థులు ఉపాధి హామీ కూలీలుగా చేపల చెరువులో కూలీల గాను పశువులు కాపర్లు తిరుగుతున్నారని 1/70, పీసా చట్టం నెంబర్ త్రీ లో ఉన్నప్పుడు షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజనేతులకు ఎలా ఉద్యోగాలు ఇస్తారని ఆ లేఖ లో ప్రశ్నించారు?

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టులో పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ద్వారా ఆదివాసీ యువతి యువకులకు పూర్తి పరిహారము చెల్లించి భూములకు భూములు కల్పించిన తర్వాత మాత్రమే తరలించాలని, తాటి మామిడి చెట్లకు ఇతర చెట్లకు కూడా పరిహారం కల్పించాలని అన్నారు. ప్రాజెక్టులో నష్టపోతున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగాలలో విద్యుత్ ప్రాజెక్టులలో కల్పించాలని ప్రభుత్వానికిసూచించారు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోడే మురళి కారం రామన్న దొర వెలగడ నాగేశ్వరావు మడకం బుచ్చిరాజు కుంజా వెంకన్న దొర వెంకన్న దొర తదితరులు పాల్గొన్నారు. (Story:5 వ,షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసి పూజర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments