Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌“ప్రతి అర్హుడి ఇంటికీ చికిత్స చేరేలా మా లక్ష్యం” 

“ప్రతి అర్హుడి ఇంటికీ చికిత్స చేరేలా మా లక్ష్యం” 

“ప్రతి అర్హుడి ఇంటికీ చికిత్స చేరేలా మా లక్ష్యం” 

67 మంది లబ్ధిదారులకు 38.94 లక్షల చెక్కులు పంపిణీ..
సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి
చీఫ్ విప్ జీవి ఆంజనేయులు

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోని పేద, అర్హులైన లబ్ధిదారులకు వైద్యసాయం చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. మొత్తం 67 మంది లబ్ధిదారులకు రూ. 38 లక్షలు 94 వేల విలువైన చెక్కులు అందించబడినట్లు ఆయన తెలిపారు. సీఎం సహాయ నిధి అంటే కేవలం ఒక పథకం కాదు… పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రాణదాయక సాయం. వైద్య ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇది అండగా నిలుస్తోందన్నారు.“చికిత్స కోసం రూపాయి కూడా లేని పరిస్థితిలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రాణసంకట స్థితి నుండి బయటపడేలా చేస్తోంది. ఈ నిధులు మిమ్మల్ని తిరిగి నిలబెడతాయి. ఇప్పటివరకు 1254 లబ్ధిదారులకి వినుకొండ నియోజకవర్గంలో సీఎం సహాయనిది అందించారు.
మొత్తం విడుదలైన సాయం: ₹8 కోట్లు 56 లక్షలు“సీఎం చంద్రబాబు నాయుడు దూరదర్శి నాయకత్వంలో ఎవరికైనా వైద్య ఆపద ఎదురైతే, ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుంది. నిధుల కోసం ఎక్కడా తిరగకుండా, సరైన డాక్యుమెంట్లు ఉంటే సాయం చాలా త్వరగా లభిస్తుందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం విద్యా రంగంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి మెరుగైన విద్యను అందిస్తున్నది అన్నారు. అలాగే 16 వేల 437 టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లిఖార్జున రావు, కూటమి నాయకులు నిశ్శంకర శ్రీనివాసరావు, ముత్తినేని ఏడుకొండలు, దాసరి కోటేశ్వరరావు, బొంకూరి రోశయ్య, పెమ్మసాని నాగేశ్వరరావు, జానీ, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story:“ప్రతి అర్హుడి ఇంటికీ చికిత్స చేరేలా మా లక్ష్యం” )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments