Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తిమ్మాయిపాలెం రైతు సేవా కేంద్రంలో లో ‘రైతన్న మీకోసం’ గ్రామసభ

తిమ్మాయిపాలెం రైతు సేవా కేంద్రంలో లో ‘రైతన్న మీకోసం’ గ్రామసభ

0

తిమ్మాయిపాలెం రైతు సేవా కేంద్రంలో లో ‘రైతన్న మీకోసం’ గ్రామసభ

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ మండలం, తిమ్మాయిపాలెం రైతు సేవా కేంద్రంలో లో రైతన్న మీకోసం గ్రామసభ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ సురేష్ కుమార్, వెటర్నరీ ఎడి డా.శ్రీరాములు, వినుకొండ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, డి.సి. చైర్మన్ ముత్తినేని కొండలు, గ్రామ పెద్దలు అడపాల రామయ్య, వెంకటేశ్వర్లు ప్రసాద్, గురజాల శ్రీను ,వెంకట్రాయుడు, రైతు సోదరులు వీఆర్వో ,వి ఏఏ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ గుర్తు వివరించారు .డి.సీ చైర్మన్ ముత్తినేని ఏడుకొండలు మాట్లాడుతూ. రైతులు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటలను సాగు చేయాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి 2025-26 రబీ,2026-27 ఖరీఫ్ & రబి యాక్షన్ ప్లాన్ గూర్చి రైతులకు తెలియజేశారు .డాక్టర్ శ్రీరాములు వారి డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేయబడుతున్న పథకాలను వివరించారు. అభ్యుదయ రైతులు శ్రీనివాసరావు కూరగాయల సాగు ద్వారా పొందిన లబ్ధిని వివరించారు ప్రకృతి వ్యవసాయం మండల ట్రైనర్ శివలక్ష్మి పి.ఎం.డి.ఎస్ ప్ర కృతి వ్యవసాయ సాగు పద్దతులగూర్చి వివరించారు.(Story:తిమ్మాయిపాలెం రైతు సేవా కేంద్రంలో లో ‘రైతన్న మీకోసం’ గ్రామసభ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version