తహసీల్దార్ కార్యాలయానికి ఇన్వెర్టర్ వితరణ
న్యూస్ తెలుగు / చింతూరు : చింతూరు తహసీల్దార్ కార్యాలయానికి జెకె సిటీ చైర్మన్ మండల తెలుగుదేశం అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ 40 వేల రూపాయల విలువైన ఇన్వర్టర్ ను తాసిల్దార్ కు అందజేశారు. కార్యాలయంలో వివిధ పనులపై వస్తున్న ప్రజలకు విద్యుత్ ఆటంకం లేకుండా త్వరితగతిన ప్రజలకు సేవలు అందించేందుకు గాను ఇన్వర్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యుత్ అంతరాయంతో ఆలస్యం అవుతున్న పనులు సత్వరం జరిగేలా తోడ్పాటు ఉంటుందని జమాల్ ఖాన్ ఇన్వర్టర్ వితరణ చేయడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయానికి అడిగిన వెంటనే ఇన్వర్టర్ సదుపాయాన్ని కలగజేసినందుకు తాసిల్దార్ సయ్యద్ హుస్సేన్ సిబ్బంది జమాల్ ఖాన్ కు ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎండి జహంగీర,సాల్మన్ జానీ విఆర్ఓ రామచంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు. (Story:తహసీల్దార్ కార్యాలయానికి ఇన్వెర్టర్ వితరణ)
