బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ సర్పంచ్ ను సన్మానించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : గోపాల్ పేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామములో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బంగారయ్య మరియు వార్డు సభ్యులు గుంటి.లక్ష్మయ్య, గుంటి.అయోధ్య రాములు,వెంకటయ్య గార్లను *మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రములో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఐకమత్యంతో సర్పంచ్ గా ఎన్నికై పార్టీ ప్రతిష్ఠ పెంచారని రాబోవు కాలములో గ్రామ అభివృద్ధికి తాను తోడ్పడుతానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన సర్పంచు బంగారయ్య,వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమములో రైతు సమితి అధ్యక్షులు తిరుపతయ్య,మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. (Story:బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ సర్పంచ్ ను సన్మానించిన మాజీ మంత్రి)

