Home వార్తలు తెలంగాణ కానిస్టేబుల్‌గా ప్రారంభమై ఎస్సైగా నిలిచిన 36 ఏళ్ల విశిష్ట పోలీసు సేవాకు వీడ్కోలు జిల్లా ఎస్పీ...

కానిస్టేబుల్‌గా ప్రారంభమై ఎస్సైగా నిలిచిన 36 ఏళ్ల విశిష్ట పోలీసు సేవాకు వీడ్కోలు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి

0

కానిస్టేబుల్‌గా ప్రారంభమై ఎస్సైగా నిలిచిన 36 ఏళ్ల విశిష్ట పోలీసు సేవాకు వీడ్కోలు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, పోలీసుశాఖలో 36 సంవత్సరాల విశిష్ట సేవ అనంతరం పదవీ విరమణ పొందుతున్న పెబ్బేరు ఎస్సై-2 జయరాం గారిని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి పూలమాల తో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు కానిస్టేబుల్‌గా సేవా ప్రయాణం ప్రారంభించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కర్తవ్యనిష్ఠ, శిస్తు, ప్రజా సేవాభావంతో నిర్విరామంగా పనిచేసిన జయరామ్ గారి సేవలను ఎస్పీ గారు హృదయపూర్వకంగా కొనియాడారు. అనేకమంది ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న ఆయన పోలీసు శాఖకు వదిలి వెళ్తున్న సేవా ముద్ర చిరస్మరణీయం. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… ఎస్సై జయరాం గారిది కేవలం 36 ఏళ్ల సేవ కాదు… ప్రజా భద్రత, నిజాయితీ, కర్తవ్యపరతకి నిలువెత్తు నిదర్శనం. జయరామ్ గారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసు కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్సై గారు 1989 సంవత్సరంలో పోలీసు వ్యవస్థలోకి కానిస్టేబుల్ గా అడుగుపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వర్తించి సర్వీస్ నందు 60 రివార్డులతో తన ప్రతిభను చాటుకున్నారు. తన సేవలకు మెచ్చిన ప్రభుత్వం 2000 సంవత్సరంలో సేవా పథకంతో గౌరవించింది. అంచలంచలుగా 2017 సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్, 2020 సంవత్సరంలో ఏఎస్ఐ, 2025 సంవత్సరంలో ఎస్సైగా పదోన్నతి పొందడం జరిగింది. ఉద్యోగం ప్రారంభం నుండి చురుకుగా ఉంటూ అధికారుల మన్ననలు పొందిన ఎస్సై జయరాం, సంఘవిద్రోహం శక్తులతో పోరాటంలో కీలక పాత్ర పోషించి జిల్లా ప్రశాంత వాతావరణంలో నెలకొల్పడానికి తనవంతు పాత్ర పోషించడం జరిగింది. ప్రారంభం నుండి ఉమ్మడి నిర్వహించడం జరిగిందిరాబోయే జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులకు గడపాలన హృదయపూర్వక శుభాకాంక్షలు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, రిజర్వు ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story :కానిస్టేబుల్‌గా ప్రారంభమై ఎస్సైగా నిలిచిన 36 ఏళ్ల విశిష్ట పోలీసు సేవాకు వీడ్కోలు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version