జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ డి సునీత
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి సునీత ఐపీఎస్, మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పాత్ర కీలకమని అన్నారు.(Story : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ డి సునీత )

