పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం, యాపర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కీ” శే” రామకృష్ణ రెడ్డి , కీ” శే” తెలుగు వెంకటయ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఇట్టి విషయం తెలుసుకొని మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అదే గ్రామానికి చెందిన వెంకటేష్ ఆరోగ్యం బాగలేనందున మాజీ మంత్రి వారి నివాసానికి వెళ్లి చూసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన నరసింహ ఆరోగ్యం బాగలేనందున మాజీ మంత్రి వారి నివాసానికి వెళ్లి చూసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి గారి వెంట మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు పట్టణ పార్టీ అధ్యక్షులు దిలీప్ కుమార్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రే స్వామి పల్లి రాజశేఖర్, సాయి ఆనంద్, అలిపిరూ నరేంద్ర రెడ్డి, మన్యం, వెంకట్ రెడ్డి, అఖిల్ చారి మూర్తి తదితరులు పాల్గొన్నారు.(Story : పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి )
