Homeవార్తలుతెలంగాణడూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల చేతిలో కవిత కీలు బొమ్మ

డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల చేతిలో కవిత కీలు బొమ్మ

డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల చేతిలో కవిత కీలు బొమ్మ

న్యూస్‌తెలుగు/వనపర్తి : డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల చేతిలో కవిత కీలు బొమ్మ అని
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కవితపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి 6గ్యారంటీలు,420హామీలు అమలు చేయకుండా 700మంది రైతుల,69మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైందని,యూరియా దొరకక,బోనస్ లేక,రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక బాధపడుతుంటే ప్రశ్నించాల్సిన కవిత తనపై వ్యక్తిగత దూషణలు చేయడం దారుణమని అన్నారు. కవిత గురించి ఏనాడు నేను పల్లెత్తు మాట అనలేదని ఊహించుకొని మాట్లాడితే ప్రజలు గమనిస్తారని అన్నారు. కవిత చేసిన ఆరోపణలు నిముషం కూడా గడవకుండా సోషల్ మీడియాలో వైరల్ చేసి డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు పైశాచిక ఆనందం చెందుతున్నారని ఆరోపించారు. 1లక్ష 20వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు నీళ్ల నిరంజనుడు అని ప్రేమతో ప్రజలు పిలుచుకుంటున్నారని మరి లిక్కర్ రాణి పేరు నీకు ఎవరు ఇచ్చారు అని దుయ్యబట్టారు. మీకు చేతనైతే మీ ఆత్మీయ ప్రభుత్వంతో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. 40ఏండ్ల రాజకీయ జీవితములో ఏనాడు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు అని 32మంది మీద కేసులు పెట్టాను అంటే ప్రెస్ ముందు బహిరంగ పరచాలని సవాల్ విసిరారు. పెబ్బేరు సంత గూర్చి ఒక డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికలలో లబ్దిపొందడానికి ప్రచారం చేస్తే దాన్ని మీరు చెప్పడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ఏం.ఆర్.ఓ కార్యాలయం తగలబెట్టారు అని అంటే అది మూర్ఖత్వం ప్రభుత్వం మీ చేతులలో ఉంది విచారణ చేసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవిత వల్ల బి.ఆర్.ఎస్ పార్టీ ప్రతిష్ఠ కోల్పోయిందని,లిక్కర్ వ్యాపారం చేసి 20లక్షల గడియారం,బంగారం,విదేశీ పర్యటనలు,గండిపేట ఫారం హౌస్ లు అవినీతితో సంపాదించింది నీవు కాదా అని అన్నారు. నీ వల్ల కె.సి.ఆర్ మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఇకనైనా ప్రజల పక్షాన ప్రభుత్వంతో కోట్లాడలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. (Story:డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల చేతిలో కవిత కీలు బొమ్మ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!