లక్ష్మి మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన లక్ష్మి కుటుంబ సభ్యులు , వినుకొండ పట్టణంలోని మాధవ ఆస్పత్రిలో చికిత్స పొంది డాక్టర్ నిర్లక్ష్యంతో వైద్యం వికటించి మృతి చెందిన యాదగిరి లక్ష్మి మరణానికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని భర్త యోగయ్య కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్, డి ఎం, హెచ్ ఓ కు ఫిర్యాదు చేశారు. వైద్య నిపుణులతో సమగ్ర విచారణ జరిపించి మృతురాలు లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. (Story:లక్ష్మి మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలి)

