పీర్లగుట్టపై కమ్యూనికేషన్ రిపీటర్ భవన నిర్మాణానికి శ్రీకారం
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ చేతుల మీదుగా భూమిపూజ
న్యూస్ తెలుగు/వనపర్తి : పోలీసింగ్‌కు సాంకేతిక బలం పీర్లగుట్టపై కమ్యూనికేషన్ రిపీటర్ భవన నిర్మాణానికి శ్రీకారం అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పోలీసింగ్‌ను సాంకేతికంగా మరింత మెరుగుపరచడానికి వనపర్తి జిల్లాలో మరో ముఖ్యమైన అడుగు పడింది. తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ నిధులతో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించనున్న “పోలీస్ కమ్యూనికేషన్ రిపీటర్ నూతన భవనం” భూమిపూజ కార్యక్రమం శుక్రవారం ఉదయం పీర్లగుట్టలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ప్రజలకు మరింత భద్రతను అందించడానికి పోలీస్ విభాగంలో ఆధునిక సదుపాయాలు అవసరం. రూ.72 లక్షల వ్యయంతో కమ్యూనికేషన్ రిపీటర్ భవనం నిర్మాణం ప్రారంభమవడం వనపర్తికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ వసతి ద్వారా పోలీసులు వేగవంతంగా స్పందించి ప్రజలకు దగ్గరవుతారు. అభివృద్ధి ప్రతిచోటా కనిపించేలా ప్రయత్నాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ.. పోలీసింగ్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా ఉండటం అత్యంత అవసరం. తెలంగాణ పోలీసు హోసింగ్ బోర్డు వల్ల దీనికి మరింత బలం లభిస్తోంది. పీర్లగుట్టపై నిర్మించబడుతున్న ఈ రిపీటర్ భవనం జిల్లా మొత్తం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఆధునికీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యవసర సేవల్లో ఇది మరింత వేగాన్ని, ప్రజా భద్రతలో అధిక నాణ్యతను తీసుకొస్తుందని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ కమ్యూనికేషన్ అనేది శాంతి భద్రతల యొక్క మూలాధారం. వనపర్తి పోలీసింగ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ఈ రిపీటర్ నూతన భవనం భారీ మార్పును తీసుకువస్తుంది. తెలంగాణ పోలీసు హోసింగ్ బోర్డు అందించిన 72 లక్షల నిధులు జిల్లా పోలీసింగ్‌కు సాంకేతికంగా బలాన్నిస్తాయి. ప్రజలకు మరింత చేరువగా, వేగంగా సేవలందించడానికి ఈ ప్రాజెక్ట్ ఒక కీలక మైలురాయని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు,శిక్షణ డిప్యుటీ కలెక్టర్,శ్రావ్య, మార్కెట్ కమిటీ చైర్మన్, శ్రీనివాస్ గౌడ్, వనపర్తి సిఐ, కృష్ణయ్య, కొత్తకోట సిఐ, రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్,, వనపర్తి ఎమ్మార్వో, రమేష్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ ఎఈ, అనిల్ శాస్త్రి, పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : పీర్లగుట్టపై కమ్యూనికేషన్ రిపీటర్ భవన నిర్మాణానికి శ్రీకారం )

