Homeవార్తలుతెలంగాణమహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్దపేట

మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్దపేట

మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్దపేట

మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి : వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి  శుక్రవారం పెద్దమందడి మండల పరిధిలోని జగత్పల్లి , మనిగిళ్ళ, పెద్దమందడి, అనకాయపల్లి దొడగుంటపల్లి, మోజ ర్ల మద్దిగట్ల, అమ్మపల్లి, చిలకటోనుపల్లి, వెల్టూర్, గట్ల కానాపురం, స్కూల్ తండా , మంగంపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపించేశారు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అనేక పనులు చేపట్టిందన్నారు,
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిర మైండ్లు రేషన్ కార్డులు, ఆదర్శ పాఠశాలలో మహిళా అధ్యక్షురాలు, పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టడం, ఆర్టిసి బస్సుల కొనుగోలులో మహిళా సమాఖ్యల భాగస్వామ్యం, వడ్డీ లేని రుణాలు, విద్యార్థులకు వసతి మెస్ చార్జీల పెంపు లాంటి అనేక పథకాలను మహిళలకు ఉపయోగపడే విధంగా అనునిత్యం మహిళా అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు

మరో 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ఎవరు మోసపోకూడదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన సూచించారు. (Story:మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్దపేట)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!