గ్రామీణ రహదారులకు మహర్దశ
అమ్మపల్లి నుంచి అల్వాలకు రోడ్డు నిర్మాణంకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పెద్దమందడి మండలంలోని పలు గ్రామీణ రహదారులకు మహర్దశ చేకూరింది. రూ. 5 కోట్ల రూపాయలతో పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామం నుంచి అల్వాల గ్రామం వరకు రూ 5 కోట్ల రూపాయలతో గట్ల కానాపురం నుంచి అల్వాల క్రాస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పనులకు రూ 5 కోట్ల రూపాయలతో అమ్మపల్లి నుంచి అల్వాల గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఈ వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామ గ్రామానికి పక్కా రోడ్ల నిర్మాణం జరుగుతుందని దీంతో గ్రామీణ రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:గ్రామీణ రహదారులకు మహర్దశ)
