ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు నూతన వస్త్రాల అందించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పెద్దమందడి మండలం, మంగంపల్లి, గ్రామా తండాకు చెందిన ఉన్స్ వాత్ దేవి, ఉన్సా వత్ శంకరమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే వారికి నూతన వస్త్రాలను అందించి అభినందించారు. మంగంపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల చెన్నమ్మ నూతన గృహప్రవేశానికి సైతం ఎమ్మెల్యే గారు హాజరై నూతన వస్త్రాలను అందించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడని అలాంటి ఇబ్బందులను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రూ. ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు . ఇందిరమ్మ ఇంటి గృహ నిర్మాణాలకు సంబంధించి దళారుల నమ్మి మోసపోకూడదని ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీకు రూ 5 లక్షల రూపాయల బిల్లును ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు (Story:ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు నూతన వస్త్రాల అందించిన ఎమ్మెల్యే)
