మానవత్వంతో స్పందించి రక్తదానం చేసిన యశ్వంత్
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాత్రి 11 గం. లకు స్పందించి రక్తదానం చేశామని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థపక అధ్యక్షులు కాగితాల మధు తెలిపారు. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి వనపర్తి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ కోసం అడ్మిట్ అవ్వడం జరిగింది. డాక్టర్స్ నిర్దారించి వెంటనే ఎబి పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి అనడంతో కుటుంబ సభ్యులు ఉమ్మడి పాలమూరు జిల్లా బ్లడ్ బ్యాంకు లో ఎంత వెతికిన దొరకకపోగా యువశక్తి ఫౌండేషన్ ని ఆశ్రయించడంతో స్పందించిన యువశక్తి ఫౌండేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నవీన్ గోబుర్ రాత్రి 11 గం. లకు ఫౌండేషన్ మెంబెర్ యస్వంత్ తో రక్తదానం చేపించారు. కుటుంబ సభ్యులు యువశక్తి ఫౌండేషన్ కి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువశక్తి ఫౌండేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నవీన్ గొబ్బూర్, ఫౌండేషన్ మెంబర్స్ యశ్వంత్, బృంగి శ్రావణ్, జమ్మికుంట విష్ణు వర్ధన్,సందీప్ పాల్గొన్నారు. (Story:మానవత్వంతో స్పందించి రక్తదానం చేసిన యశ్వంత్)

