నవంబర్ 19 న వరల్డ్ టాయిలెట్ డే
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ డా షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నవంబర్19 వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, మున్సిపల్ ఏఈ ఆదినారాయణ, పట్టణం పరిధిలో గల సురేష్ మహల్ రోడ్, నర్సరావుపేట రోడ్, మున్సిపల్ ఆఫీస్, బస్ స్టాండ్, లాయర్స్ స్ట్రీట్ నందు గల పబ్లిక్ టాయిలెట్స్ మరియు పలు స్కూల్స్ నందు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహకులకు హైజీన్ మైంటైన్స్ గురించి మరియు వసతుల ఎర్పాటు గురించి తగు సూచనలిచ్చారు. అలాగే పరిశుభ్రత పాటించని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు,మేస్ట్రిలు ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story:నవంబర్ 19 న వరల్డ్ టాయిలెట్ డే)

