Home వార్తలు తెలంగాణ డీజీపీ  చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్న వనపర్తి జిల్లా పీఆర్వో 

డీజీపీ  చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్న వనపర్తి జిల్లా పీఆర్వో 

0

డీజీపీ  చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్న వనపర్తి జిల్లా పీఆర్వో 

న్యూస్‌తెలుగు/వనపర్తి : హైదరాబాదులోని పేట్లబుర్జ్ సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో
మూడు రోజులపాటు జరిగిన పీఆర్వోల శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శ్రీ శివదర్ రెడ్డి, ఐపీఎస్ శిబిరంలో ప్రతిభ కనబర్చిన పీఆర్వోలను అభినందించి, ప్రశంస పత్రాలు అందజేశారు. వనపర్తి జిల్లా పీఆర్వో ఎస్. రాజ గౌడ్ అద్భుత ప్రతిభ కనబర్చినందుకు తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ శివధర్ రెడ్డి, ఐపీఎస్., గారి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నందున గురువారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారు పిఆర్వో రాజా గౌడ్ ను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పీఆర్వో ప్రజలతో పోలీసులను కలిపే వంతెనలు కావాలి. ప్రతి సంఘటనలో పోలీసుశాఖ యొక్క నిజమైన రూపాన్ని సమాజానికి చేర్చడం మీ ముఖ్యమైన బాధ్యత. మీ మాట, మీ రాత ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలని సమాచారం స్పష్టంగా, సమయానికి అందించడం ద్వారా పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఈ సోషల్ మీడియా యుగంలో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ఎంతో కీలకం అని ఎస్పీ అన్నారు. (Story:డీజీపీ  చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్న వనపర్తి జిల్లా పీఆర్వో )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version