Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సొంతింటి కలలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

సొంతింటి కలలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

0

సొంతింటి కలలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

న్యూస్ తెలుగు/సాలూరు: పేదల సొంతింటి కలలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 3 లక్షల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఆటహాసంఘ కార్యకర్తల నడుమ సాలూరు మున్సిపాలిటీ 12వ వార్డులో గృహప్రవేశం మరియు ఇల్లు శంకుస్థాపనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
సాలూరు మున్సిపాలిటీలో మొత్తం 195 ఇళ్లకు ఆమోదం లభించిందని పేర్కొన్నరు.
పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 22,833 ఇళ్లు ఆమోదించగా, అందులో 15,661 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీఎం-జన్‌మన్ పథకంలో 5,169 ఇళ్లు ఆమోదించగా 4,263 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలియజేశారు.
సాలూరు, పార్వతీపురం, పాలకొండ మున్సిపాలిటీలలో కొత్తగా 634 ఇళ్లకు ఆమోదం లభించినట్లు తెలియజేశారు. పేదవాడికి ఇల్లు కట్టుకోవడం ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలని కోరిక ఈ ప్రభుత్వం తీరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కేతిరెడ్డి చంద్ర, కౌన్సిలర్లు హర్ష మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కేతిరెడ్డి గాయత్రి దేవి తదితరులు పాల్గొన్నారు. (Story:సొంతింటి కలలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version