Homeవార్తలుతెలంగాణతిరుమలయ్య గుట్టను పర్యటన కేంద్రంగా ప్రకటించాలి

తిరుమలయ్య గుట్టను పర్యటన కేంద్రంగా ప్రకటించాలి

తిరుమలయ్య గుట్టను పర్యటన కేంద్రంగా ప్రకటించాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా లో అతి పురాతనమైన తిరుమలయగుట్టను పర్యటన కేంద్రంగా ప్రకటించాలని వనపర్తి జిల్లా బిజెపి ధార్మిక సెల్ ఎండోమెంట్ కో కన్వీనర్ భగవంతుయాదవ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రజలు ప్రతినెల ఏడవ తేదీన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం కోసం వెళ్ళుచుంటారు. కానీ డబ్బులేని నిరుపేద హిందువుల కోసం వనపర్తి పట్టణమునకు ప్రతి సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే విధంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని, అక్కడ నిత్యం పూజలు కార్యక్రమాలు నిర్వహించే విధంగా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరినారు. ప్రభుత్వం వెంటనే తిరుమలయ్య గుట్టను పర్యటక కేంద్రంగా ప్రకటన చేసి రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. (Story:తిరుమలయ్య గుట్టను పర్యటన కేంద్రంగా ప్రకటించాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!