Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాల బాలికలకు అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు

బాల బాలికలకు అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు

0

బాల బాలికలకు అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు

న్యూస్ తెలుగు/వినుకొండ : ఈనెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల యందు 69వ అంతర్ జిల్లాల కబడ్డీ స్కూల్ గేమ్స్ బాలబాలికలకు కబాడీ గేమ్ నందు ఆటల పోటీలు జరుగుతాయని పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ ఎన్ సురేష్ rకుమార్ తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 26 జట్లు పోటీలలో పాల్గొనున్నట్టు తెలిపారు. ఇక్కడ మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి హర్యానాలో జరిగే జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గంగినేని రాఘవరావు డిసీ చైర్మన్ మాట్లాడుతూ.. మన వినుకొండ పట్టణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఆటలు పోటీలను ప్రతిష్టాత్మకంగా మన వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు సూచనలతో క్రీడాకారులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక కౌన్సిలర్ అయిన ప్రత్తి వేదవతి పూర్ణచంద్రరావు సూచనలతో క్రీడా మైదాని సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డివిజనల్ ఎస్ జి ఎఫ్ కోఆర్డినేటర్ వైవి చిరంజీవి రావు, వినుకొండ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షులు అంగటి బాజు, కార్యదర్శి గణప వీరాంజనేయులు రాగుల రాధాకృష్ణ మూర్తి, పాపచాని చిన్రామయ్య కాకుమాని రాజేష్ మద్దం వెంకటేశ్వర్లు ఎన్ వెంకటరత్నం, జి చిన్న అంకారావు , మహేష్, వినుకొండ జోన్ వ్యాయామ ఉపాధ్యాయులు, ఏర్పాట్లులలో చురుకుగా పాల్గొంటున్నారు.(Story:బాల బాలికలకు అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version