చింతూరులో గ్రామసభ
న్యూస్ తెలుగు /చింతూరు : బిర్సా ముండా 150 వ జయంతి పురస్కరించుకొని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశముల మేరకు చింతూరు పంచాయితి కార్యాలయంలో ఏపీవో తులసి గ్రామసభ ప్రారంభించారు. సర్పంచి కారం కన్నారావు అధ్యక్షతన గ్రామ సభఏర్పాటు చేయడమైనది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిధిగా చింతూరు ఐటీడీఏ ఏపీవో తులసి హాజరై. ఆదికర్మ యోగి 5 సంవత్సరముల ప్రణాళిక గ్రామ పంచాయితీ ద్వారా తయారు చేశారు . ఆ జాబితాలో మార్పులు చేర్పులు ఉంటే గ్రామ సభ దృష్టికి తీసుకొని రావాలని గిరిజన నిరుద్యోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న వివిధ నైపుణ్య అభివృద్ధి శిక్షణ తీసుకొని ఆర్థికంగా బలపడాలని యువత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వృత్తిలో నైపుణ్య అభివృద్ధి సాధించాలని సూచించారు. చింతూరు ఎండిఓ శ్రీనివాస్ దొర ఆదికర్మయోగి విధి విధానాలను చేపట్టబోయే కార్యక్ర మా లను గ్రామ సభలో వివరించారు. ఈ గ్రామ సభకు సిడిపిఓ, మాజీ ఎంపీటీ సి మేడే పల్లి సుధాకర్ బిజెపి మండల అధ్యక్షులు బట్ట లక్ష్మయ్య , జనసేన మండల అధ్యక్షులు మాడివి రాజు, బిజెపి మాజీ అధ్యక్షులు చిట్టిబాబు. పీసా కమిటి సభ్యులు కారం సాయిబాబా ఇతరులు హాజరయ్యారు. (Story:చింతూరులో గ్రామసభ)

