Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రైతు సంక్షేమమే ధ్యేయంగా కూట‌మి ప్రభుత్వం

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూట‌మి ప్రభుత్వం

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూట‌మి ప్రభుత్వం

2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి
మంత్రి గుమ్మడి సంధ్యారాణి 

న్యూస్ తెలుగు /సాలూరు : కుటమీ ప్రభుత్వం రైతు సంక్షేమం జ్యేయంగా పనిచేస్తుందని ఈ సంవత్సరం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శ్రీ సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణితో కలిసి జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ 2025-26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేకరణ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

​ఈ ఏడాది ప్రభుత్వం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని నిర్దేశించిందని, గత సంవత్సరం కొనుగోలు చేసిన 2.24 లక్షల మెట్రిక్ టన్నుల కంటే సుమారు 10% ఎక్కువని జేసీ అన్నారు. జిల్లాలో సుమారు 1.86 లక్షల ఎకరాల్లో వరి పంట వేయడం జరిగిందని, ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయిందన్నారు.
ఈ సీజన్‌లో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.
​జిల్లా వ్యాప్తంగా ఉన్న 281 రైతు భరోసా కేంద్రాలను గ్రూపింగ్ చేసి 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా (DPCs) ఏర్పాటు చేసామని, ఆయా కేంద్రాలలో కొనుగోలు సహాయక సంస్థల ద్వారా సిబ్బందిని నియమించి, ​అవసరమైన పరికరాలు అన్ని కేంద్రాల్లో అందుబాటులో సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 7 లక్షల గోనె సంచులను సిద్ధం చేసి, మిల్లర్ల నుండి కేంద్రాలకు తరలిస్తున్నామని జేసీ చెప్పారు. కూలీలను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం జరిగిందని, ధాన్యం రవాణా కోసం ఇప్పటికే సుమారు 1050 వాహనాలను రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జరిగిందని, మరో 450 నుంచి 500 వాహనాలను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. వాహనాలకు జిపిఎస్ (GPS) ట్రాకర్ కనెక్ట్ చేయడం జరిగిందన్నారు. ​జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రెవెన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాల సంస్థ (CSCL) మరియు పౌర సరఫరాల విభాగం (CSD) కలిసి సమన్వయంతో పనిచేసి, ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలులో ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story;రైతు సంక్షేమమే ధ్యేయంగా కూట‌మి ప్రభుత్వం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!